భారతదేశం, జూలై 8 -- అనంతపురం జిల్లాలో అరటి ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి, తాడిపత్రి ప్రాంతంలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేల, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని అరటి టిష్యూ కల్చర్ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అరటి పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి అనువైన భూమిని గుర్తించడానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆయనతో పాటు BBSSL (భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్) ప్రతినిధి పరేష్ దేశాయ్, ఆర్అండ్‌డీ ప్రతినిధి జయప్రకాష్‌తోపాటుగా పలువురు అధికారులు ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పంట ఉత్పత్తికి అవసరమైన సారవంతమైన నేల, నీటి వనరులు, రవాణా సౌకర్యాల గురించి కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు.

భారతదేశం అంతటా పంట విత్తనా...