భారతదేశం, నవంబర్ 26 -- భారత ప్రభుత్వం పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిక్స్‌డ్ టర్మ్ కాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది స్థానాలకు రిటైర్డ్ అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన నిపుణులను నియమించాలని సీసీఐ అనుకుంటోంది.

తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సీసీఐ ఈ స్థానాలను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించాలని కోరుకుంటోంది. ఇందులో రెండు పోస్టులు ఉన్నాయి. ఒకటి సూపర్ వైజర్, మరొకటి షిఫ్ట్ ఆపరేషన్ పోస్టు. పోస్టుల ఆధారంగా అర్హత ఉండాలి. 05.12.2025న అంటే శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తెలంగాణ, తాండూర్ మండలం, వికారాబాద్ జిల్లా, కరన్‌కోటే గ్రామంలోని సీసీఐ లిమిటెడ్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ ఉంటుంది.

సూపర్ వైజర్ పోస్టుకు బి.ఎస్సీ (కెమిస...