Hyderabad, సెప్టెంబర్ 23 -- క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి జనావర్ (Janaawar) అనే థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ వెబ్ సిరీస్ సాగనుంది.

ఈవారం ఓటీటీ రిలీజ్ లలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతోంది. జనావర్ - ది బీస్ట్ వితిన్ అనే ఈ సిరీస్ శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ అడవి, అక్కడ దొరికే ఓ తల లేని మొండెం, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇందులో భువన్ అరోరా లీడ్ రోల్‌లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హేమంత్ కుమార్ గా నటించాడు. శచీంద్ర వాట్స్ దర్శకత్వం వహించిన 'జనావర్' సిరీస్‌లో 8 ఎప...