భారతదేశం, ఆగస్టు 4 -- శిశువుకు పాలిచ్చేటప్పుడు తల్లి మానసిక స్థితి ఎంత ముఖ్యమైనదో చాలా మందికి తెలియదు. పాలు సరిగా వస్తున్నాయా, బిడ్డ సరిగ్గా పట్టుకుందా వంటి శారీరక విషయాల గురించి ఆలోచించినంతగా, తల్లి మనసులో ఉన్న భావోద్వేగాలను పట్టించుకోరు. తల్లి మానసిక ఆరోగ్యం, పాల ఉత్పత్తి మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా కొత్త తల్లులు బిడ్డ పుట్టిన తర్వాత ఆనందంతో ఉంటారని భావిస్తారు. కానీ వాస్తవానికి నిద్రలేని రాత్రులు, బిడ్డను చూసుకునే ఒత్తిడి, శారీరక అలసట, హార్మోన్ల మార్పుల వల్ల చాలా మంది కొత్త తల్లులు నిరాశ, ఆందోళనతో బాధపడుతుంటారు.

పూణేలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన లాక్టేషన్ కన్సల్టెంట్ డాక్టర్ విధి మెహతా మాట్లాడుతూ.. "తల్లి మానసిక ఆరోగ్యం పాలివ్వడాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నేను దగ్గరగా చూశాను. మొదటి కొ...