భారతదేశం, అక్టోబర్ 28 -- వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. బై 7పీఎమ్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ నవంబర్ 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 28) నాడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ మేరకు నిర్వహించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర...