భారతదేశం, ఆగస్టు 27 -- బ్లాక్-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (BLK-Max Super Specialty Hospital)లోని ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ శాచి బవేజా, హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లిపాలు శిశువులను వివిధ వ్యాధుల నుంచి ఎలా రక్షిస్తాయో వివరించారు. ఈ అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శిశువు పుట్టిన వెంటనే తల్లి నుంచి వచ్చే పాలను కొలెస్ట్రమ్ అంటారు. ఇది రోగనిరోధక కణాలు, యాంటీబాడీలు, యాంటీమైక్రోబియల్ పదార్థాలతో (లాక్టోఫెర్రిన్, లైసోజైమ్, ఒలిగోసాకరైడ్స్, సైటోకైన్‌లు, యాంటీఆక్సిడెంట్లు) నిండి ఉంటుంది. అందుకే ఈ మొదటి పాలను బిడ్డకు ఇచ్చే మొదటి టీకా అని కూడా పిలుస్తారు.

తల్లిపాలలో శిశువు పేగులలో (గట్) కొన్ని రకాల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. ఇది శిశువు జీర్ణవ్యవస్థను, గట్ మైక్రోబయోమ్‌ను ...