భారతదేశం, డిసెంబర్ 18 -- చదువు సంస్కారాన్ని నేర్పుతుందంటారు.. కానీ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులనే అత్యంత క్రూరంగా చంపడమే కాకుండా, ఆనవాళ్లు దొరక్కుండా వారి శరీరాలను ముక్కలుగా నరికి నదిలో పారేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్‌పూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది.

నిందితుడు రింకూ (37) కలకత్తాలో ప్రేమ వివాహం చేసుకుని, గత మూడు నెలలుగా తన తల్లిదండ్రులతో కలిసి అహ్మద్‌పూర్‌లో నివసిస్తున్నాడు. డిసెంబర్ 8న ఆస్తి, డబ్బు విషయంలో రింకూకు, అతని తల్లిదండ్రులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన రింకూ, తన తల్లి బబితా దేవి తలపై ఇనుప రోకలితో బలంగా కొట్టాడు. ఆమె కిందపడి ప్రాణభయంతో విలవిలలాడుతుండగా, తండ్రి అక్కడికి చేరుకున్నారు.

పోల...