భారతదేశం, డిసెంబర్ 14 -- ఈనెల 21న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌క‌మార్ యాద‌వ్ తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్ల‌ల్లంద‌రికీ పోలియో చుక్క‌ల్ని త‌ప్ప‌కుండా వేయించాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్రాల్లో నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్క‌లు వేసేందుకు ఇప్ప‌టికే జిల్లాల‌కు 61,26,120 డోస్ ల‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పంపించారని మంత్రి సత్యకుమార్ వివరించారు.

డిసెంబ‌ర్ 21వ తేదీన పోలియో దినం సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌ల్ని వేస్తారు. ఆరోజు ప‌లు కార‌ణాలవ‌ల్ల పోలియో చుక్క‌లు వేసుకోలేక‌పోయిన పిల్ల‌లకు తిరిగి ఈనెల 22,...