భారతదేశం, జనవరి 10 -- పిల్లల్లో అలెర్జీలు, గవత జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు సాధారణంగా సూచించే ఆల్మాంట్-కిడ్ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పిల్లల కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ (Almont-Kid) సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్‌ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్‌లో గుర్తించారు. ఈ బ్యాచ్‌ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని.. మార్కెట్‌లో దీని విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖ...