భారతదేశం, డిసెంబర్ 8 -- పలు తెలుగు సినిమాలతోపాటు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో కనిపించిన నటి సోనియా ఆకుల. ఆమె తాజాగా ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడిస్తూ పాప పేరును కూడా రివీల్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్ గా ఉన్న సోనియా ఆకుల సోమవారం (డిసెంబర్ 8) ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, వ్యాపారవేత్త అయిన యశ్ వీరగోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

"08-12-2025.. ఆమె వచ్చింది. మా ప్రపంచం పరిపూర్ణమైంది. మా ప్రేమకు పెట్టిన కొత్త పేరే శిఖా వీరగోని" అనే క్యాప్షన్ తో యశ్ పోస్ట్ చేశారు. అందులో షేర్ చేసిన ఫొటోలో పాప చేయితోపాటు ఆమె పేరును కూడా చూడొచ్చు. కింద సోనియా యశ్ అని ఉంది.

సోనియా ఆకుల తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన నటి. 2019ల...