భారతదేశం, డిసెంబర్ 8 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారా అద్వానీ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తన ముద్దుల కుమార్తె సారాయా మల్హోత్రాకు జన్మనిచ్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కియారా సోమవారం (డిసెంబర్ 8) ముంబైలో తొలిసారిగా బహిరంగంగా కనిపించింది. ఆమెను చూడగానే అభిమానుల్లో, మీడియా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఆమెను చాలా ఫిట్‌గా ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

సోమవారం (డిసెంబర్ 8)నాడు ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసం కియారా అద్వానీ ముంబైలోని సెట్స్‌కు వచ్చింది. ఆమె చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. లూజ్ పౌడర్-బ్లూ షర్ట్, డెనిమ్ షార్ట్స్ లో కనిపించిన కియారా.. ఎప్పటిలాగే ఎవర్‌గ్రీన్ స్మైల్ తో అందరినీ పలకరించింది.

ఆమెను చూడగానే మీడియా వాళ్లు చుట్టుముట్టారు. ఒక ఫోటోగ్రాఫర్ స్ప...