Hyderabad, సెప్టెంబర్ 22 -- ఓజీ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ గురువారమే (సెప్టెంబర్ 25) థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రైలర్ ను సోమవారం (సెప్టెంబర్ 22) మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ నోట కేవలం రెండే రెండు డైలాగులు మాత్రమే వినిపించాయి. మిగతాదంతా ఫుల్ యాక్షనే.

పవన్ కల్యాణ్ రెండు నెలల గ్యాప్ లో రెండో సినిమాతో వస్తున్నాడు. దే కాల్ హిమ్ ఓజీ అంటూ మరో పవర్‌ఫుల్ పాత్రతో అభిమానులను అలరించబోతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో పవర్ స్టార్ మాస్ యాక్షన్ పూనకాలు తెప్పిస్తోంది. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త అనే రెండే డైలాగులు ఈ ట్రైలర్లో పవన్ నోట వినిపిస్తాయి.

ఇక చివర్లో ఓజస్ గంభీరా అంటూ తన పూర్తి పేరు చెబుతూ చేతిలో ఉన్న గన్ ను పేలుస్తూ చాలా ఆవేశంగా కనిపిస్తాడు. ఒకప్పటి బాంబే గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే...