భారతదేశం, అక్టోబర్ 27 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం చిట్టి అలేఖ్య పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. దాంతో ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు 9లో నామినేషన్స్ జరగనున్నాయి.

ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 27 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో నామినేషన్స్‌లో భాగంగా అందరు ఇంటి సభ్యులు గార్డెన్‌లో కూర్చున్నారు.

"బిగ్ బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి మరోసారి సిద్ధమైంది. మీరు ఆడే ఆటను ఒళ్లంత కళ్లు చేసుకుని చూసినవారు మీ తలరాత రాయబోతున్నారు" అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన కంట...