భారతదేశం, జనవరి 16 -- చాలా మంది హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తలస్నానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మాత్రమే తలస్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే తలస్నానం కేవలం శుభ్రత కోసమే కాదు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యం, అదృష్టం, మనసుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

తలస్నానం చేయడానికి కొన్ని రోజులు శుభప్రదమైనవి, అలాగే కొన్ని రోజులు తలస్నానం చేయడానికి అశుభకరమైనవి. మరి ఏ రోజు తలస్నానం చేస్తే మంచిది? ఏ రోజు తలస్నానం చేయకూడదు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తలస్నానం అంటే కేవలం నీళ్లతో చేసే స్నానం. అదే తలంటు స్నానం అంటే తలకు, శరీరానికి నూనె రాసుకుని చేసే స్నానం. దానిని తలంటు అని అంటారు. ఈ తలంటు స్నానం చేయడానికి కొన్ని రోజులు శుభప్రదమైనవి.

ఆదివారం నాడు తలంటు స్నానం చేయడం మంచిద...