భారతదేశం, డిసెంబర్ 8 -- తెలుగులో మరో కామెడీ ఎంటర్టైనర్ వస్తోంది. అయితే ఇది ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ కావడం విశేషం. ఈ సినిమా టీజర్ ను సోమవారం (డిసెంబర్ 8) మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.

మలయాళం స్టార్ యాక్టర్ బేసిల్ జోసెఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ జయ జయ జయహే తెలుసు కదా. 2022లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే భర్త ఆమె చేతుల్లో ఎలా తన్నులు తిన్నాడు.. తర్వాత ఎలా దారికి వచ్చాడన్న ఫన్నీ స్టోరీతో తెరకెక్కింది.

ఈ సినిమాను ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతి: పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అంబటి ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్.. కొండవీటి ప్రశాంతిగా ఈష...