భారతదేశం, జూలై 4 -- హీరో నితిన్ కి ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర సరైన టైమ్ నడవడం లేదు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ నితిన్.. కొత్త సినిమా 'తమ్ముడు'పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో వచ్చిన తమ్ముడు సినిమా కు సోషల్ మీడియాలో నెగెటివిటీ వస్తోంది. మూవీ బాలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో నితిన్ మళ్లీ డిసప్పాయింట్ మెంట్ తప్పేలా లేదు. శుక్రవారం (జూలై 4) థియేటర్లలో రిలీజైంది తమ్ముడు మూవీ.

తమ్ముడు సినిమా చూసిన చాలా మంది అభిమానులు ఇలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకున్నందుకు నితిన్ పై అసహనం వ్యక్తం చేశారు. ఒక ఎక్స్ యూజర్ ఇలా రాశాడు.. "తమ్ముడు చెత్త! ప్రీమియర్ నైట్ షోలో ఆయన సినిమాలు చూసే మూర్ఖుడిని నేను అని పదేపదే గుర్తు చేస్తున్న నితిన్ కు ధన్యవాదాలు. ఈ సినిమాలో వారు 'హామీ ఇచ్చినట్లు' ఎమోషనల్ డ్రామా క...