Hyderabad, జూన్ 11 -- ఈ మధ్యే రాబిన్‌హుడ్ మూవీతో మరో ఫ్లాప్ మూటగట్టుకున్న నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడో 27 ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ నటించిన మూవీ టైటిల్ తోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జులై 4న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (జూన్ 11) రిలీజ్ చేశారు.

ఇప్పటికే టాలీవుడ్ లో ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ వేణుయే ఈ తమ్ముడు మూవీని తీశాడు. నితిన్, లయ నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా తన క్యారెక్టర్ మాత్రం కోల్పోని అక్క మాట నిలబెట్టే తమ్ముడిగా ఇందులో నితిన్ నటించాడు.

ఆమె నోటితో తనను తమ్ముడు అని పిలిపించుకోవాలన్న ఆశ అతనిది. ఆమె మాట నిలబెట్టడం కోసం ఆర్చర్ గా దేశం తరఫున బరిలోక...