Hyderabad, జూలై 5 -- టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమ్ముడు సినిమాపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

అయితే, జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వస్తోంది. ఆ ప్రభావం తమ్ముడు కలెక్షన్స్‌పై పడింది. తొలి రోజున తమ్ముడు సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో మొదటి రోజు తమ్ముడు సినిమాకు రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.

అలాగే, వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద తమ్ముడు మూవీకి రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్‌లోనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర...