భారతదేశం, డిసెంబర్ 18 -- అల్లు శిరీష్, టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఒక యాడ్‌లో నటించాడు. ఇది చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థ్రిల్ అయ్యాడు. తమ్ముడిని చూసి గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టాడు. శిరీష్, రోహిత్ శర్మల ఈ ఊహించని కలయిక ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ యాడ్‌లో సందడి చేశారు. ఇందులో రోహిత్ సతీమణి రితికా సజ్దే కూడా కనిపించింది. వీరిద్దరి కాంబినేషన్ చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. ఆ విషయాన్నే చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్ లో గురువారం (డిసెంబర్ 18) ఓ పోస్ట్ చేశాడు.

ఈ యాడ్ చూసిన వెంటనే అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించాడు. "ఎంత మంచి సర్ ప్రైజ్! వావ్ సిరి.. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా...