Hyderabad, జూలై 1 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారి కోసం మరో మూవీ వస్తోంది. ఈ తమిళ మూవీ పేరు పరమశివన్ ఫాతిమా (Paramashivan Fathima). టైటిల్ వెరైటీగా ఉంది కదూ. మూవీ స్టోరీ మరింత వెరైటీగా ఉంటుంది. గత నెల 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ పరమశివన్ ఫాతిమా వచ్చే శుక్రవారం (జులై 4) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (జులై 1) వెల్లడించింది.

"ఈ కథను తెలుసుకుందాం", "దీని తర్వాత ఏం జరుగుతుంది" అనే క్యాప్షన్లతో రెండు ట్వీట్స్ చేసింది. ఓ పోస్టర్, మరో వీడియో రిలీజ్ చేసింది. జూన్ 6న థియేటర్లలో రిలీజై ఐఎండీబీలో 7.4 రేటింగ్ సాధించిన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

పరమశివన్ ఫాతిమా మూవీలో విమల్, ఛాయా దే...