Hyderabad, జూలై 29 -- తెలుగులో ఓటీటీలోకి వస్తున్న తమిళ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు జిన్ ది పెట్ (Jinn The Pet). ఈ సినిమా మే 30న థియేటర్లలో రిలీజైంది. జూన్ 20న అంటే మూడు వారాల్లోపే తమిళంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పుడీ సినిమాను అదే ఓటీటీ తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయబోతోంది.

తమిళ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా తెలుగులో ఓ చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేసింది.

"మీరు ఇప్పటి వరకూ చూడని పెట్ ఇది. దీని ధర ఎవరూ ఊహించనిది. జిన్: ది పెట్ (తెలుగు) ఆగస్ట్ 1న సన్ నెక్ట్స్ లోకి రానుంది. మీ జీవితంలో చూడని ఓ స్పెషల్ రైడ్ చూడటానికి సిద్ధంగా ఉండండి" అనే క్యా...