Hyderabad, ఆగస్టు 19 -- టాలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ఆకట్టుకునే హీరో సహాస్. ఇప్పుడు తమిళంలో మొదటిసారిగా హీరో సుహాస్ విలన్‌గా చేస్తున్న సినిమా మండాడి. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే.

'సెల్ఫీ' ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న మండాడి సినిమాలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన సన్నివేశాలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో 'మండాడి' చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

యంగ్ హీరో సుహాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఇవాళ (ఆగస్టు 19) సుహాస్ పుట్టినరోజు సందర్భంగా 'మండాడి' మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత...