Hyderabad, ఆగస్టు 1 -- తమిళంలో ఈ ఏడాది వచ్చిన హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 3 బీహెచ్‌కే (3 BHK). సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయానిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా గత నెల థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. శుక్రవారం (ఆగస్ట్ 1) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

తమిళంతోపాటు తెలుగులోనూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ నటించిన మూవీ 3 బీహెచ్‌కే. ఇదో కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. జులై 4న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో తమ్ముడు రిలీజైన రోజే వచ్చినా.. ఆ సినిమా కంటే పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ నెల 4 నుంచి జియోహాట్‌స్టార్ లో వస్తుందని భావించినా.. ఇప్పుడు ముందుగానే రావడం విశేషం. ప్...