Hyderabad, ఆగస్టు 12 -- మరో తమిళ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ పేరు అక్కెనమ్ (Akkenam). తమిళంలో మూడు చుక్కలను సూచించే పదం ఆధారంగా ఈ టైటిల్ పెట్టారు. ఈ మూవీ కూడా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజ్ కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈవారం ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

తమిళ థ్రిల్లర్ మూవీ అక్కెనమ్ మూవీ ఆహా తమిళం ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్టు 12) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"థ్రిల్ రైడ్ మొదలు కావడానికి సిద్ధంగా ఉంది. అక్కెనమ్ మూవీ ఆగస్టు 15 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజ...