Hyderabad, అక్టోబర్ 8 -- కిరణ్ అబ్బవరం గతేడాది క మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మధ్యే వచ్చిన దిల్‌రుబాతో వచ్చినా అది నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు కే ర్యాంప్ అనే సినిమా అక్టోబర్ 18న రానుండగా.. ఈ మూవీ ప్రమోషన్లలో కిరణ్ బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో భాగంగా గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిరణ్ తమ సినిమాలకు తమిళనాడులో థియేటర్లు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానున్న ' కే ర్యాంప్'లో కిరణ్ అబ్బవరం నటించాడు. ఇటీవల గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ యువ నటులకు తెలుగు నాట థియేటర్లు దక్కుతున్నా.. తన సినిమాలకు తమిళనాడులో థియేటర్లు దొరకడం లేదని కిరణ్ తన బాధను పంచుకున్నాడు. దీపావళికి విడుదలవుతున్న ప్రదీప్ రంగనాథన్ సినిమాతో అతడు పోల్చి చూశాడు.

"గతంలో నేను 'క' సినిమాను తమిళనాడులో విడుదల చేయడాని...