Hyderabad, ఆగస్టు 20 -- తమిళంలో ఈ ఏడాది వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ మూవీ పెరంబం పెరుంగోబమమ్ (peranbum perungobamum). ఈ సినిమా జూన్ లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ వారం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయనున్న ఆహా తమిళం ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

తమిళ ఇండస్ట్రీలో వెరైటీ టైటిల్ తో వచ్చిన మూవీ ఈ పెరంబం పెరుంగోబమమ్. అంటే గొప్ప ప్రేమ గొప్ప కోపం అనే అర్థంలో వాడతారు. ఈ మూవీ జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

"ఈ కథను అస్సలు మిస్ కావద్దు. పెరంబం పెరుంగోబమమ్ ఆగస్టు 22 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ ఉండటం విశేషం.

ఇదొక రివేంజ్ థ్రిల్లర...