భారతదేశం, డిసెంబర్ 4 -- ఓటీటీలోకి లేటెస్ట్‌గా వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. నిజానికి శుక్రవారం (డిసెంబర్ 5) స్ట్రీమింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో తరచుగా చాలా వరకు వెబ్ సిరీస్ ఈ జానర్లోనే తెరకెక్కిస్తుంటారు. అలా తమిళం నుంచి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ఈ కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్. ఈ సిరీస్ ను సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో చూడొచ్చు. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. సెల్వమణి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో పశుపతి, విదార్థ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళిలాంటి వాళ్లు నటించారు.

కుట్రమ్ పురింధ...