భారతదేశం, జూలై 6 -- ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళం కంటే కూడా ఇతర డబ్బింగ్ భాషల్లో సత్తాచాటుతోంది. ఆ సిరీసే.. 'గుడ్ వైఫ్'. కోర్టు డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ను ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఓటీటీలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

జియోహాట్‌స్టార్‌ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా గుడ్ వైఫ్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ జూలై 4న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ ఈ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇతర భాషల్లోకి డబ్ అయింది.

గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ తెలుగులో టాప్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ కోర్టు డ్రామా థ్రిల్లర్ సిరీస్ తెలుగులో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కూకు విత్ జాతిరత్నాలు అనే కుకిం...