భారతదేశం, జూలై 19 -- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు (77) కన్నుమూశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు కరుణానిధి మొదటి భార్య పద్మావతికి జన్మించారు. తన సోదరుడి మరణం తనను పిడుగుపాటేలా బాధించిందని ఎంకే స్టాలిన్ ఎక్స్ లో రాశారు. 'ముత్తమిళ్ అరిగ్నార్ కలైంజ్ఞర్ కుటుంబానికి చెందిన పెద్దకుమారుడు ఎంకే ముత్తు మరణవార్త ఈ రోజు ఉదయం నన్ను పిడుగులా తాకింది. తల్లి, తండ్రితో సమానమైన ఆప్యాయత చూపిన నా ప్రియమైన సోదరుడిని కోల్పోయిన బాధ నన్ను వేధిస్తోంది' అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ లో రాశారు. 'మా తండ్రి ముత్తువేలార్ జ్ఞాపకార్థం ఆయనకు ఎంకే ముత్తు అని పేరు పెట్టారు. ''నాయకుడు కలైంజ్ఞర్ లాగే సోదరుడు ముత్తు కూడా చిన్నప్పటి నుంచే నాటకాల ద్వారా ద్రవిడ ఉద్యమానికి సేవ చేయడం ప్రారంభించారు'' అని స్టాలిన్ ...