భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని టెంకాసి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది! రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 28 మంది గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్‌పట్టి వైపు వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి పరుగులు తీసిన స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.

మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న కైసర్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

"కైసర్ బస్సు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందని ...