Hyderabad, అక్టోబర్ 11 -- లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందుకున్న యూత్ సెన్సేషన్, తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా డ్యూడ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

'ప్రేమలు' వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన డ్యూడ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇటీవల డ్యూడ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించి డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా ప్రమోషన్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు ఆ...