భారతదేశం, డిసెంబర్ 23 -- రణ్‌వీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్'లోని 'షరారత్' పాట కోసం తమన్నా భాటియాను రిజెక్ట్ చేశారన్న వార్తలపై కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ స్పందించాడు. ఆమెను రిజెక్ట్ చేయలేదని, ఆ సీన్‌లో ఉండాల్సిన టెన్షన్ కంటే తమన్నా స్టార్ ఇమేజ్ ఎక్కువ డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఆమెను సంప్రదించలేదని అతడు స్పష్టం చేశాడు.

ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ 'ధురంధర్' (Dhurandhar). రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్‌లో 'షరారత్' అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆడిపాడిన ఈ పాట కోసం మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను అనుకున్నారట. అయితే దర్శకుడు ఆమెను రిజెక్ట్ చేశారంటూ వచ్చిన వార్తలను కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ ఖండించాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడు...