Hyderabad, ఆగస్టు 28 -- బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా తన పర్‌ఫెక్ట్ టోన్డ్ బాడీతో అద్భుతమైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుంది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన ఫిగర్‌ను హాట్‌గా ఉంచడానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఆరోగ్యకరమైన ఆహారం అని తెలిపింది.

10-12 సంవత్సరాలుగా తనకు తెలిసిన తన ఫిట్‌నెస్‌ కోచ్‌తో ఆగస్టు 23న జరిగిన ఇంటరాక్షన్‌లో ఫిట్‌నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది తమన్నా భాటియా. తాను ఉదయం త్వరగా లేచే వ్యక్తిని అని వెల్లడించింది. అలాగే, తనను ప్రేరేపించే ఫిట్‌నెస్ మంత్ర రహస్యాలు పంచుకుంది ముద్దుగుమ్మ తమన్నా భాటియా.

తమన్నా భాటియా ఫిట్‌నెస్ మంత్ర గురించి మాట్లాడిన కోచ్ సిద్ధార్థ సింగ్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "ఉదయం 4.30 గంటలకు లేచి వర్కౌట్ చేసుకుంటా. తర్వాత 12 గంటల షూటింగ్ షిఫ్ట్‌కు వెళ్తాను. నిలకడతో కూడిన సుస్థిరమైన ఫిట్‌నెస్‌...