భారతదేశం, జనవరి 16 -- మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గ్లామర్, డ్యాన్స్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన పాట 'ఆజ్ కీ రాత్' (Aaj Ki Raat). 2024లో వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్-కామెడీ మూవీ 'స్త్రీ 2' (Stree 2) విజయానికి ఈ పాట కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మోత మోగించిన ఈ పాట.. ఇప్పుడు యూట్యూబ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును క్రాస్ చేసింది.
ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. శుక్రవారం (జనవరి 16) నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాట షూటింగ్ సమయానికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ క్లిప్స్‌ను షేర్ చేసింది. "మొదటి వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు.. ఇంత ప్రేమను కురిపించినందుకు అందరికీ ధన్యవాదాలు" అని క్యాప్షన్ ఇచ్చింది.
ఆ వీడియోలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.