Hyderabad, జూన్ 26 -- దంగల్ ఫేమ్, నటి ఫాతిమా సనా షేక్ తెలుసు కదా. ఆమె ఈ జులైలో రెండు రొమాంటిక్ డ్రామాల్లో కనిపించబోతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో 2007లో వచ్చిన హిట్ మూవీ 'లైఫ్ ఇన్ ఎ మెట్రో'కి సీక్వెల్‌గా వస్తున్న 'మెట్రో ఇన్ దినో'లో ఆమె నటించింది. ఆ తర్వాత, నెట్‌ఫ్లిక్స్ సినిమా 'ఆప్ జైసా కోయి'లో ఆర్. మాధవన్‌తో కలిసి కనిపించనుంది. అయితే, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఫాతిమా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. ఆమె తమన్నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఫాతిమా స్పందించింది.

మాధవన్ తో కలిసి ఆమె నటించిన ఆప్ జైసా కోయి మూవీ ట్రైలర్ లాంచ్ బుధవారం (జూన్ 25) ముంబైలో జరిగింది. దీనికి ఫాతిమా తన సహనటుడు ఆర్. మాధవన్‌తో కలిసి హాజరయ్యింది. 'మీనాక్షి సుందరేశ్వర్' ఫేమ్ వివేక్ సోని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప...