భారతదేశం, సెప్టెంబర్ 14 -- రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.... ఈ విషయంలో రాజీ అనేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్ర గ్రోత్ రేట్ పెరుగుతుందని చెప్పారు.

జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సీఎం చంద్రబాబు శనివారం సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు సహా పలు అంశాలపై ఎస్పీలకు దిశా నిర్ధేశం చేశారు. కొందరు ఎస్పీలు నేరుగా సమావేశానికి హాజరు కాగా... మరికొన్ని జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి. నేరాల తీరు మారింది. కొత్త తరహా నేరాలు... కొత్త తరహా నేరస్తులు వచ్చారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్ డేట్ కావాలి. అప్పుడే శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలం." ...