Hyderabad, సెప్టెంబర్ 22 -- ఆదిపురుష్ మూవీ ఫెయిల్యూర్ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ సినిమా వైఫల్యంపై చాలా రోజుల తర్వాత డైరెక్టర్ ఓం రౌత్ స్పందించాడు. ఈ సినిమా తీసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎంతో మంది అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. వాటి వల్ల తాను ఎలాంటి బాధలు అనుభవించానో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు.

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ఓ బాలీవుడ్ న్యూస్ పోర్టల్ తో మాట్లాడాడు. ఆ సినిమా గురించి అతడు ఏమన్నాడో చూడండి. "నిజాయతీగా చెప్పాలంటే నాకు ఎలాంటి సలహా ఇవ్వలేనని అనుకుంటున్నాను. చాలా కష్టంగా అనిపించింది.

కావాలని ఎవరూ తప్పులు చేయరు. తప్పులు జరిగిపోతాయి. విజయం ఎంతో నేర్పిస్తుంది కానీ వైఫల్యం మరింత ఎక్కువ నేర్పుతుంది. ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం, అవి మళ్లీ జరగకుండా చూడటం ద్వారా వాటి నుంచి బయటపడవచ...