భారతదేశం, ఏప్రిల్ 28 -- టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని మొత్తం 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు, వెబ్ సైట్ లోని మార్కులకు తేడాలున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్‌లు దాఖలు చేసినట్లు గుర్తించిన హైకోర్టు గ్రూప్‌ -1 అభ్యర్థులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలు రీవాల్యుయేషన్‌ చేసి మార్కులు పారదర్శకంగా వెల్లడించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్లు తప్పుడు పత్రాలు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. టీజీపీఎస్సీ దాఖలు చేసిన ప్రాథమిక వివరాలను పరిశీలించిన కోర్టు.. అభ్యర్థులు తప...