భారతదేశం, డిసెంబర్ 23 -- హీరోయిన్లు చీరలే కట్టుకోవాలని, సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోకూడదని కామెంట్స్ చేసిన నటుడు శివాజీ దిగి వచ్చాడు. తాను తప్పు చేశానని, క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దండోరా అనే మూవీ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేగడం.. అనసూయ, చిన్మయిలాంటి వాళ్లు ఘాటుగా స్పందించడంతో శివాజీ దిగివచ్చాడు.

నటుడు శివాజీ మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం ఓ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేశాడు. అందులో అతడు మహిళలందరికీ క్షమాపణ చెప్పాడు.

"నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అనకూడని మాటలు అన్నాను. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెబుతున్నాను. ఆ మాటలు అందరు అమ్మాయిలను ఉద్దేశించి చేసినవి కావు. నేను ఎవరినీ అవమానపరచాలని చేయలేదు. నేను ఎప్పుడూ స్త్రీ అంటే అమ్మవారిలాగే, మహాశక్తిలాగే చూస్తాను. సమాజంలో స్త్రీ...