భారతదేశం, నవంబర్ 27 -- మలక్కా జలసంధి, ఇండోనేషియా సమీపంలోని తీవ్ర వాయుగుండం సెన్యార్ తుపానుగా బలపడింది. అయితే ఇది పశ్చిమ దిశగా కదులుతూ తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటింది. దీని ప్రభావం మనకు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.

అండమాన్ అండ్ నికోబార్ దీవులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కేరళ, మాహేలలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వైపు కదులుతూ.. మరింత బలపడనున్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ప్రధానంగా తమిళనాడును ప్రభావితం చేస్తుంది. నవంబర్ డిసెంబర్ 1 వరకు ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ ...