భారతదేశం, డిసెంబర్ 9 -- భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్ గురించి కాదు.. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన ఫోటోగ్రాఫర్లపై అతడు తీవ్రంగా మండిపడ్డాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ (Mahieka Sharma) ఫోటోలను అభ్యంతరకరమైన యాంగిల్లో తీయడంపై హార్దిక్ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న హార్దిక్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక ఘాటు సందేశాన్ని పోస్ట్ చేశాడు.

బాంద్రాలోని ఒక రెస్టారెంట్ మెట్లపై మహీకా శర్మ దిగుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు ఆమె ఫోటోలను తీసిన విధానం హార్దిక్‌ పాండ్యాకు కోపం తెప్పించింది. దీనిపై ఇన్‌స్టా స్టోరీస్ లో అతడు ఓ పోస్ట్ చేశాడు.

"పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాపై నిఘా, ఆసక్తి ఉండటం సహజమేనని నాకు అర్థమ...