భారతదేశం, నవంబర్ 28 -- బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ కుమార్తెకు ఒక అందమైన పేరు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 28) ఈ జంట తమ పాప పేరును అనౌన్స్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు పోస్ట్ చేసిన ఫొటో కూడా చాలా క్యూట్ గా ఉంది.

తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేసి అభిమానులకు దగ్గరైన నటి కియారా అద్వానీ. ఆమె ఈ మధ్యే ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వాళ్లు తమ పాపకు సరాయా అనే పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. తమ కుమార్తె చిన్ని పాదాలను పట్టుకున్న ఒక ఫొటోను షేర్ చేస్తూ వారు ఇలా రాశారు. "మా ప్రార్థనల నుండి మా చేతుల్లోకి.. మా దివ్య ఆశీర్వాదం, మా రాకుమారి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra)" అనే క్యాప్షన్ ఉంచారు.

ఈ జంటకు, వారి కుమార్తెకు...