భారతదేశం, జనవరి 12 -- గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే కేవలం నటన వస్తే సరిపోదు, అద్భుతమైన అందం కూడా ఉండాలని చాలామంది నమ్ముతుంటారు. సరిగ్గా ఇదే ఆలోచన బ్యూటిపుల్ హీరోయిన్ తాప్సీ పన్నును కెరీర్ మొదట్లో తీవ్రంగా వేధించిందట. తనకంటే పెద్ద బ్యూటిఫుల్ స్టార్స్ ముందు తాను హీరోయిన్‌గా ఎలా రాణిస్తాననే సందేహంతో రోజులు గడిపానని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తన కెరీర్ తొలినాళ్లలోని అభద్రతా భావం గురించి తాప్సీ మాట్లాడింది. "నా చుట్టూ ఉన్న గ్లామరస్ హీరోయిన్లలా నేను కనిపించను కదా, నన్ను హీరోయిన్‌గా ఎవరు తీసుకుంటారు? అని ఎప్పుడూ భయపడేదాన్ని. అసలు హీరోయిన్ కావాలంటే ఉండాల్సిన కనీస లక్షణాలు నాలో లేవనుకున్నా. అప్పట్లో నాకు బేసిక్ ఫ్యాషన్ సెన్స్ లేదు, మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు, కెమెరా ముందు నా బెస్ట్ యాంగిల్ ఏదో కూడా అవగాహన ఉండేది కాదు" అని తాప్సీ ...