భారతదేశం, డిసెంబర్ 22 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలేతో ముగిసిపోయింది. బిగ్ బస్ తెలుగు 9 సీజన్ టైటిల్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకుని విజేతగా నిలిచాడు కల్యాణ్ పడాల.

అయితే, బిగ్ బాస్ పాల్గొన్నవారంత అనంతరం బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి కల్యాణ్ పడాల హాజరయ్యాడు. హీరో, బిగ్ బాస్ శివాజీ హోస్ట్‌గా చేస్తున్న బజ్ ఇంటర్వ్యూలో కల్యాణ్ పడాల పాల్గొన్న ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

బజ్ ఇంటర్వ్యూలోకి ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ పడాల. "నీ గురించి ఒకటి చెప్పాలని ఉందయ్యా.. తనను తాను చెక్కుకున్న శిల్పివీడు" అని శివాజీ అన్నాడు. "నీ గేమ్ చేంజ్ అవ్వడానికి కారణం మాత్రం దివ్య అంటే ఒప్పుకుంటావా. నీలో స్పిరిట్‌ను రగిలించింది తను" అని శివా...