భారతదేశం, సెప్టెంబర్ 17 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పోరు రెండో వారానికి చేరుకుంది. ఫస్ట్ వీక్ లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. మరి ఈ వారం నామినేషన్లలో ఎంత మంది ఉన్నారు? డేంజర్ జోన్ లో ఎవరున్నారో చూద్దాం. అలాగే హౌస్ లో సరదాగా ఉంటున్న ఇమ్యాన్యుయేల్ తనూజాకు సరదాగా ఫోన్లో ముద్దులు పెట్టాడు.

ముందుగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో రోజైన నేటి (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. రెండు రోజుల సీరియస్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో కాస్త ఫన్ క్రియేట్ చేయడానికి ఇమ్యాన్యుయేల్ ట్రై చేస్తున్నాడు. తనూజాతో కలిసి కామెడీ చేస్తున్నాడు. తనూజా ఫోన్ చేస్టున్నట్లు యాక్ట్ చేయగా.. లిఫ్ట్ చేయగానే ఇమ్మాన్యుయేల్ ముద్దుల దా...