Hyderabad, ఏప్రిల్ 25 -- తను సాంగ్ లిరిక్స్: నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న మూవీ హిట్ 3. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందు శుక్రవారం (ఏప్రిల్ 25) ఈ సినిమా నుంచి తను అంటే ఓ మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే మ్యూజిక్, సింగింగ్, పిక్చరైజేషన్ తో ఈ పాట ఆకట్టుకుంటోంది.

హిట్ 3 మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా.. నాని, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది. ఇక తాజాగా మూవీ నుంచి వచ్చి తను సాంగ్ ఆకట్టుకునేలా సాగింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట పాడటం విశేషం. ఇక రాఘవ్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.

ఈ పాట మొత్తం శైలేష్ స్టైల్లో చాలా భిన్నంగా సాగిపోతూ ఉంటుంది. లిరిక్స్, మ్యూజిక్, దానిని చిత్రీకరించ...