Hyderabad, జూన్ 16 -- టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తమిళ అగ్ర హీరో ధనుష్ ముగ్గురు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జూన్ 15న గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్‌గా హంబుల్‌గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ, ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను" అని అన్నారు.

"శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నే...