భారతదేశం, జూలై 23 -- జగదీప్ ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ఎవరు వస్తారనే ఇంట్రస్ట్ అందరిలోనూ ఉంది. ఆరోగ్య కారణాల వల్ల జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో దేశంలో రెండో అత్యున్నత పదవి ఖాళీగా మారింది. ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే సాధ్యమైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా తర్వాత అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. జగదీప్ ధన్‌ఖర్ స్థానంలో ఎవరు వస్తారు అనేదానిపై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.

నితీష్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బీహార్‌లో బీజేపీకి చెందిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుపెట్టేందుకు నితీష్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి ఆఫర్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు ఇంకా తగ్గలేదు. చాలా మంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదుపరి తరానికి మార్గం సుగమం చేయడానికి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొల...