భారతదేశం, మే 16 -- తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయ్యింది. 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయ్యింది. 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశాం. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల...