భారతదేశం, మే 4 -- నాని లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది థర్డ్ కేస్' బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గాయి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ శనివారం అనుకున్నంత వసూళ్లు రాలేకపోయాయి. తొలి రెండు రోజులతో పోలిస్తే నెట్ వసూళ్లు మూడో రోజు మరింత తగ్గాయి. ఈ హిట్ 3 మూవీ మే 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి.

నాని హిట్ 3 మూవీ మూడో రోజు (మే 3) రూ.8.57 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టినట్టు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మూడు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.40.07 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. నాని సినిమా ఇండియాలో ఫస్ట్ రోజు రూ.21 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఇందులో తెలుగు నుంచి రూ.20.25 కోట్లు, తమిళంలో రూ.0.35 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు, హ...